తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు
Actor ProfilePolitician

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా
Asianet News Telugu14 Oct 2026
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. పోటెత్తిన వరదనీరు, ఈ ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ తప్పవా

Flash Floods Alert : సాధారణంగా జూలై, ఆగస్ట్ లో భారీ నుండి అతిభారీ వర్షాలుంటాయి... అసలు సిసలైన వర్షాకాలం ఇదే. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు ఉప్పొంగుతాయి... ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారతాయి. కానీ ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవలేవు... అడపాదడపా మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవకున్నా కొన్ని ప్రాంతాల్లో ప్లాష్ ప్లడ్స్ వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది... వరద నీటితో ప్రాజెక్టులకు నిండుకుండల్లా మారుతున్నాయి. ఈ క్రమంలో నీటిని దిగువకు వదులుతున్నాయి... కాబట్టి గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలకు ఆస్కారం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టే గోదావరి నది నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి... దాదాపు 550 కిలోమీటర్ల దూరం రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో భారీ వరదనీటిని మోసుకుని తెలంగాణలోకి ప్రవేశిస్తోంది గోదావరి. ఇక్కడ వర్షాలు లేకపోయినా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ వరద పరిస్థితులను సృష్టిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది… 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలా 70,140 క్యూసెక్కులు ఇన్ ప్లో వస్తుండగా... వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి జలకలను సంతరించుకుంది. వేసవి కాలంలో భారీగా నీటిమట్టం తగ్గగా... ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలతో అంతకంతకు నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 10.9 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది... స్నానఘట్టాల వద్దకు వరద