తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ హైక్స్ ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. టికెట్ రేట్స్ పెంపు ద్వారా వచ్చిన మొత్తాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది.‘అఖండ 2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’ వంటి సినిమాలకు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు పెంచుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాలకు టికెట్ ధరల పెంపుతో వచ్చిన ఆదాయంలో 20 శాతం ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలని నిర్మాతలను ప్రభుత్వం కోరింది. ఆ మొత్తాన్ని ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్’, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అకౌంట్ లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆయా సినిమాల నిర్మాతలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏసీ, నాన్ ఏసీ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. దాని ప్రకారం నాన్-ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70.. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100 ఉంటుంది. ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150.. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200 ఉంటుందని పేర్కొంది.ఇక స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియం టికెట్ రేట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250.. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300 ఉండేలా నిర్ణయించింది. మల్టీప్లెక్స్‌లలో రెగ్యులర్ టికెట్ల రేటు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250.. రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలానే
Actor ProfileCelebrity
తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త రేట్లు.. నిర్మాతలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Jan 2027
తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త రేట్లు.. నిర్మాతలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు