తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
Actor ProfilePolitician

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
Zee Telugu7 Oct 2026
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Balamrutham New Plant: 'ప్రజా ప్రభుత్వంలో 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నాం. 3 కోట్ల 28 లక్షల తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నాం. పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించాం. 2034లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం' అని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ప్రారంభించిన ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగింది. ఇవాళ నూతన బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు. 'ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు. గర్బిణీ ఆడబిడ్డలకు పౌష్టిక ఆహారం అందించాలనే బాలామృతం కొత్త ప్లాంటు ప్రారంభించుకున్నాం. అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు చేయాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను తీసుకొచ్చామని.. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామని వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. 'విద్యార్థులకు నాణ్యమైన విద్య