తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మత్స్యకారులకు శుభవార్త.. వారందరికీ రూ.5లక్షలు
Actor ProfilePolitician

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మత్స్యకారులకు శుభవార్త.. వారందరికీ రూ.5లక్షలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మత్స్యకారులకు శుభవార్త.. వారందరికీ రూ.5లక్షలు
10TV Telugu28 Nov 2026
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మత్స్యకారులకు శుభవార్త.. వారందరికీ రూ.5లక్షలు

Telangana Govt : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నివర్గాల ప్రజల అర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్దికి పెద్దపీట వేస్తున్న సర్కార్.. తాజాగా.. వారికి ప్రమాద బీమా పథకాన్ని వర్తింప చేస్తోంది. మత్స్యకారులకు రూ.5లక్షల వరకు ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి శ్రీహరి తెలిపారు. 18 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగిన వారందిరకీ ఇది వర్తిస్తుందని అన్నారు. ఈ పథకానికి 4,21,767మంది రిజిస్టర్ అయ్యారని, కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో ప్రీమియం చెల్లిస్తాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.21,34,79,673 ఇస్తుందని మంత్రి చెప్పారు. ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి వైకల్యానికి గురైనా రూ. 5లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.5లక్షలు, చికిత్సకు రూ. 2,5000 వరకు అందిస్తారని మంత్రి తెలిపారు