తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గీత
Actor ProfilePolitician

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గీత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గీత, చేనేత కార్మికులకు శుభవార్త.. వారికి నెలనెలా డబ్బులు
10TV Telugu12 Jan 2027
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గీత, చేనేత కార్మికులకు శుభవార్త.. వారికి నెలనెలా డబ్బులు

Telangana Govt : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గీత, చేనేత కార్మికులకు శుభవార్త చెప్పారు. గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పైన ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, అర్హులైన నేత గీత కార్మికులు ఎంత మంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్‌లను ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. గౌడ సోదరులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే గౌడ సోదరులకు 50వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. అదేవిధంగా ప్రమాదవశాత్తూ గౌడ సోదరులు చనిపోతే రూ.5లక్షలు పరిహారం చెల్లిస్తున్నామని అన్నారు. సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలని అన్నారు. ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు. బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. విద్యార్థులకోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తాం. గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదు. మా ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన