తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్ లో భారీ పురోగతి
Actor ProfilePolitician

తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్ లో భారీ పురోగతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్ లో భారీ పురోగతి
Andhra Jyothy12 Oct 2026
తెలంగాణ విద్యారంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. పీజీఐ 2.0 ర్యాంకింగ్ లో భారీ పురోగతి

తెలంగాణ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యారంగంలో (Telangana Education) అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) విడుదల చేసిన పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. గతంలో 31వ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకుంది. అలాగే PGI స్కోరు 552.5 నుంచి 599.7కు పెరగడం రాష్ట్ర విద్యా వ్యవస్థలో నమోదైన మెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది. దీంతో తెలంగాణ ఆకాంక్షి-1 విభాగం నుంచి ప్రచేష్ట-3 విభాగంలోకి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితంగా జనగాం, మంచిర్యాల జిల్లాలకు ఉత్తమ్-3 గుర్తింపు లభించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 10,006 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించగా, 25,950 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. అదేవిధంగా 1.12 లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించి బోధన నాణ్యతను మరింత మెరుగుపరిచింది. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం 120 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (KGBVS) ఇంటర్ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. మరో 93 కేజీబీవీలకు యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు లభించింది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) ఫలితాల్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణిత విభాగాల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ 1,132 పాఠశాలల్లో ICT ల్యాబ్‌లు, 2,036 పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 4,249 ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ లిటరసీ పాఠ్యాంశాలను