తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా రూ. 668 కోట్ల బడ్జెట్ తో 7 సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే
Actor ProfilePolitician

తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా రూ. 668 కోట్ల బడ్జెట్ తో 7 సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా రూ. 668 కోట్ల బడ్జెట్ తో 7 సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే
Zee Telugu6 Nov 2026
తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా రూ. 668 కోట్ల బడ్జెట్ తో 7 సరికొత్త ప్రాజెక్టులు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ESIC Mega Project: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమానికి కొత్త ఊపునివ్వనుంది. జులై 14వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. హైదరాబాద్ లోని సనత్ నగర్ ఈఎస్ఐసీ ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా రూ. 668 కోట్ల వ్యయంతో 7 ప్రధాన ఆరోగ్య ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న సనత్‌నగర్ ఈఎస్‌ఐసి ఆసుపత్రి ఈ ప్రధాన కార్యక్రమానికి ముఖ్య కేంద్రంగా ఉంటుంది. రూ.211.13 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన కొత్త ఓపీడీ విభాగాన్ని స్వయంగా ప్రారంభించడంతో పాటు, మిగిలిన ఆరు ప్రాజెక్టులను కూడా ఇక్కడి నుంచే వర్చువల్‌గా దేశానికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా పాల్గొననున్నారు. దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్మాణ రంగ కార్మికులను మాండవియ ఈ వేదికపై సత్కరించనున్నారు. ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా అందనున్నాయి. తెలంగాణ కార్మికులకు వరం... సనత్‌నగర్‌లో కొత్త ఓపీడీ: హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐసి వైద్య కళాశాల, ఆసుపత్రిలో 43,611.04 చదరపు మీటర్ల విశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ కొత్త ఓపీడీ విభాగాన్ని నిర్మించారు. ఇది జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, డెంటల్, గైనకాలజీ, కంటి చికిత్స, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆయుష్ విభాగాలకు ఒకేచోట ఓపీడీ సేవలను