
హైదరాబాద్ నగరంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి హరిత రవాణాను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026కు ఈ క్రమంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని పొల్యూషన్ కు కారణం అవుతున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చనున్నారు.18,766 పాత ఇంధన ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగామొదటి దశలో సుమారు 18,766 పాత ఇంధన ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఎలక్ట్రిక్ ఆటో పైన లక్షా 50 వేల రూపాయల సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా నగరంలో పొల్యూషన్ తగ్గుతుంది. ఇంధన ధరల భారం నుంచి డ్రైవర్లకు ఉపశమనం లభిస్తుంది.ఎలక్ట్రిక్ ఆటో కన్వర్షన్ కు రూ.1.50 లక్షల సబ్సిడీఇందులో లబ్ధిదారులకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంచారు. పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోలో ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ అమర్చుకోవచ్చు. లేదా పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయవచ్చు. రెండు ఆప్షన్లలోనూ రూ.1.50 లక్షల సబ్సిడీ వర్తిస్తుంది. కన్వర్షన్ కిట్ల సాంకేతిక ప్రమాణాలు, వాహన భద్రత, బ్యాటరీ లైఫ్‌పైన కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.16 వారాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన రవాణా శాఖ ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి రవాణా శాఖ 16 వారాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తొలి 8 వారాల్లో ఆటో యూనియన్లతో అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఆపై ప్రామాణిక కిట్ల తయారీ సంస్థల ఎంపిక, ధరల స్థిరీకరణ జరుగుతాయి. 8వ వారం నాటికి ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తు, అర్హతల ధ్రువీకరణ, ఆర్‌టీవో వెరిఫికేషన్