తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్! ఎందుకు
Actor ProfilePolitician

తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్! ఎందుకు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్! ఎందుకు
Telugu Times8 Jan 2027
తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్! ఎందుకు

దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత భారతీయ జనతా పార్టీ అత్యంత బలంగా ఎదుగుతూ, అధికారానికి చేరువవుతోందని భావిస్తున్న రాష్ట్రం తెలంగాణ. కానీ, బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ జాబితా తెలంగాణ నేతలతో పాటు కేడర్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఒక్క నాయకుడికి కూడా చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కమిటీలో తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ముగ్గురు కీలక నేతలను అధిష్ఠానం ఈసారి తప్పించింది. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. గతంలో బంగారు శ్రుతి, జి.ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దుగ్గియాల ప్రదీప్ రావు వంటి నాయకుల పేర్లను రాష్ట్ర శాఖ జాతీయ స్థాయి బాధ్యతల కోసం సిఫార్సు చేసినప్పటికీ, అధిష్ఠానం మాత్రం తెలంగాణ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఒకవైపు తెలంగాణను దక్షిణాదిలో తమ ప్రధాన రాజకీయ కేంద్రంగా బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంటే, మరోవైపు ఇతర దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ జాతీయ స్థాయిలో సముచిత స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డిలకు కార్యవర్గంలో స్థానం లభించగా, రామ్ మాధవ్‌ను ఢిల్లీ కోటాలో పార్టీ జాతీయ జట్టులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ప్రొఫెసర్ ఎం. నాగరాజాను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. తమిళనాడు నుంచి డాక్టర్ ఎం. వెంకటేశన్‌కు జాతీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. కేరళ నుంచి కె. సురేంద్రన్, అనిల్ ఆంటోనీలను జాతీయ కార్యదర్శులుగా