తెలంగాణ గొప్పతనం
Actor ProfileActor

తెలంగాణ గొప్పతనం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్
Sakshi26 Nov 2026
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్

ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక సందడిగా జరిగింది. పలు దేవాలయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా తదితరులు కనిపించారు. ఇక మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొంది. తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించింది. అలానే తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. (ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం) 'చాలా కొత్తగా ఉంది. తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటది. అందరినీ అంగీకరిస్తారు. అందరితో కలిసి ఉంటారు. అది బెస్ట్' అని ఫరియా భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే పోతురాజులతో కలిసి ఆకట్టుకునే డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వేరే మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బోనాల్లో పాల్గొని ఫరియా మతసామరస్యం చాటుకుంది. కెరీర్ విషయానికొస్తే.. జాతిరత్నాలు తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం చిత్రాల్లో నటించింది. (ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా': హీరోయిన్ దుషార) 'హుషారు పిట్టలు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) ఆషిక బర్త్ డే సెలబ్రేషన్స్.. అక్క-బావ సర్‌ప్రైజ్ గిఫ్ట్ (ఫొటోలు) హీరోయిన్ హన్సిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు) అతని మీద ఎలాంటి కేసు పెట్టారంటే.. చింతాడ రవి అరెస్ట్ పై సంచలన నిజాలు పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య మా ఇంటి ఏకైక డాక్టర్.. చివరి ఫోన్‌కాల్ గుర్తుచేసుకుని కన్నీళ్లు అంత మొగోడివా నువ్వు... దమ్ముంటే జైల్లో పెట్టించు చూస్తా.. బంగారం ధరలకు బ్రేక్.. వారం తరువాత భారీగా పతనం