
తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంత వాడివేడిగా మారాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరింది. అధికారం కోల్పోయిన అసహనాన్ని దూకుడుగా మార్చుకున్న గులాబీ దళం, ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తున్న ప్రతి అంశాన్ని ఆయుధంగా మలచుకుంటోంది. అయితే, ప్రతిపక్షం దూకుడుగా విసురుతున్న రాజకీయ బాణాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్ యంత్రాంగం తీవ్రంగా తడబడుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రతిపక్షం వ్యూహాత్మక దాడిని కొనసాగిస్తోంది. లగచర్ల వివాదం, మూసీ ప్రక్షాళన వ్యయం, హైడ్రా కూల్చివేతల పరిణామాలు, టెస్సరాక్ట్ భూ కేటాయింపులు, సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరోపణలు… ఇలా ప్రతి అంశాన్ని సోషల్ మీడియా, మీడియా సమావేశాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక వివాదంతో ప్రభుత్వంపై నెగెటివ్ నెరేటివ్‌ను సెట్ చేయడంలో వారు దూకుడు ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ సంధించే రాజకీయ ఆరోపణలకు సమాధానం ఇచ్చే బాధ్యతను దాదాపుగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక్కరే భుజాన వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, శ్రీధర్ బాబు శైలి అత్యంత హుందాగా, చట్టబద్ధమైన నిబంధనలు, పాలసీ అంశాల చుట్టూ తిరుగుతుంది. ప్రతిపక్షం చేసే మాస్, అగ్రెసివ్ దాడిని ఎదుర్కోవడానికి కేవలం సాంకేతిక వివరణలు మాత్రమే సరిపోవని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు ఘాటైన రాజకీయ భాషలోనే సమాధానం ఇవ్వకపోతే, ప్రతిపక్షాల ప్రచారమే నిజమనే భావన ప్రజల్లో నాటుకుపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ కేబినెట్‌లో బలమైన వాగ్ధాటి ఉన్న నేతలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా పోరాడిన సీనియర్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై ఇంతటి దాడి జరుగుతున్న వేళ వారిలో ఎక్కువమంది ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. తమ శాఖల వ్యవహారాలు తప్ప, పార్టీ లేదా ప్రభుత్వ రక్షణ కోసం మూకుమ్మడిగా గళం విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీలోని సమన్వయ లోపమా లేక