
ఏపీలో కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టటం ఏపీకి వరంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు


ఏపీలో కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టటం ఏపీకి వరంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు

తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేదల సొంతింటి కల తీర్చటానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను ఒకేసారి కేటాయించాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు.కేంద్రమంత్రికి తెలంగాణా విజ్ఞప్తి తాజాగా న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎంపీలతో కలిసి మంత్రి పొంగులేటి కలిశారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పేదల గృహ అవసరాలను వివరిస్తూ ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో తెలంగాణాకు ఇళ్ళను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీ.పీ. గౌతమ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.ఆవాస్ ప్లస్-2024 యాప్ ద్వారా సర్వే చేసి ఇళ్ళ అర్హుల గుర్తింపు రాష్ట్రంలో ప్రజాపాలనలో ఇళ్ల కోసం 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్ ప్లస్-2024 యాప్ ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించగా 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్లకు అర్హులుగా గుర్తించబడ్డాయని పొంగులేటి కేంద్రమంత్రికి చెప్పారు. సూపర్ చెక్, అనర్హుల తొలగింపు ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు.సీఎం ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళారన్న మంత్రి పొంగులేటి అర్హులైన కుటుంబాల జాబితాను రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం. తెలంగాణకు ఇళ్లు మంజూరు చేయాలని నేను పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక దఫాలుగా కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. స్వయంగా ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భాల్లోనూ రాష్ట్ర గృహ అవసరాలను ఆయన దృష్టికి తీసుకువచ్చాను అని పొంగులేటి తెలిపారు.తెలంగాణాలో డిమాండ్