తెలంగాణ ఐటీఐలకు మహర్దశ
Actor ProfilePolitician

తెలంగాణ ఐటీఐలకు మహర్దశ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణ ఐటీఐలకు మహర్దశ
Andhra Jyothy7 Oct 2026
తెలంగాణ ఐటీఐలకు మహర్దశ

తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. వృత్తి విద్యతోపాటు, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ.. న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐ) రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. వృత్తి విద్యతోపాటు, యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ.. ‘పీఎం-సేతు’ (ప్రధానమంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయిబిలిటీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐ) పథకం కింద తెలంగాణలో మూడు ఐటీఐ క్లస్టర్ల ఆధునీకరణకు ఆమోదం తెలిపింది. కార్పొరేట్‌ సంస్థల భాగస్వామ్యంతో, రూ. 757.19 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర నైపుణ్యాభివృద్థి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ‘పీఎం-సేతు’ 4వ నేషనల్‌ స్టీరింగ్‌ కమిటీ (ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు పైలట్‌ ప్రాతిపదికన అమలు చేస్తున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా 200 క్లస్టర్ల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా, గుజరాత్‌ రాష్ర్టాల్లో కలిపి ఐదు ఐటీఐ క్లస్టర్లను రూ.1,237.58 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తెలంగాణలో ఓల్డ్‌ సిటీ, పటాన్‌చెరు, సంగారెడ్డి క్లస్టర్లను ఆధునీకరించనున్నారు