
TV9 Telugu•9 Oct 2026
తారక్ క్యారెక్టర్ లో ట్విస్ట్ ..అలా యాక్సెప్ట్ చేస్తారాడైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని, ఐదేళ్ల క్రితం ఈ కథ చెప్పినప్పుడు తారక్ అంగీకరించడానికి ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నామని నీల్ అన్నారు.డ్రాగన్ కథా నేపథ్యం 1960ల నాటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఓపియం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. ఈ మాఫియా నేపథ్యంలో సాగే కథలో, ఎన్టీఆర్ లుగర్ అనే క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది