తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎస్ ఎస్ డీ టోకెన్ల జారీ రద్దు
Actor ProfilePolitician

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎస్ ఎస్ డీ టోకెన్ల జారీ రద్దు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎస్ ఎస్ డీ టోకెన్ల జారీ రద్దు
Zee Telugu13 Jan 2027
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఎస్ ఎస్ డీ టోకెన్ల జారీ రద్దు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala SSD Tokens: ఆపద మొక్కులవాడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి దాదాపు ఒక రోజు సమయం పడుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అంటే బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులందరూ సర్వదర్శనానికి వెళ్లాలని సూచించారు. రేపు గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులకు జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు బుధవారం జారీ చేయడం లేదని టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద ఇచ్చే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇవ్వకపోవడంతో భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని సూచించింది. ఇక శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లు యథావిధిగా గురువారం మధ్యాహ్నం జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు. కాగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో టీటీడీ 8 వారాలుగా అధ్యయనం చేస్తోంది. కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 80,905 మంది భక్తులు దర్శించుకోగా.. 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం లభించింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో హుండీ