తిరుమలలో తెలంగాణ భక్తుడికి పెద్ద కష్టమే వచ్చింది.. టీటీడీ అప్రమత్తతో సేఫ్
Actor ProfileCelebrity

తిరుమలలో తెలంగాణ భక్తుడికి పెద్ద కష్టమే వచ్చింది.. టీటీడీ అప్రమత్తతో సేఫ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమలలో తెలంగాణ భక్తుడికి పెద్ద కష్టమే వచ్చింది.. టీటీడీ అప్రమత్తతో సేఫ్
Samayam Telugu30 Sept 2026
తిరుమలలో తెలంగాణ భక్తుడికి పెద్ద కష్టమే వచ్చింది.. టీటీడీ అప్రమత్తతో సేఫ్

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. స్వామిని దర్శించుకుని తిరిగి సొంత ఊర్లకు వెళ్లిపోతుంటారు. కొందరు భక్తులు హడావిడిలో వారి విలువైన వస్తువుల్ని పోగొట్టుకుంటున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ భక్తుడు తిరుమలలోని వసతి గదిలో బంగారం మర్చిపోయి వెళ్లారు.. టీటీడీ సిబ్బంది గుర్తించి తిరిగి ఆ భక్తుడికి అప్పగించారు. తాజాగా తెలంగాణకు చెందిన మరో భక్తుడు బంగారం, డబ్బులు ఉన్న బ్యాగ్ పోగొట్టుకోగా టీటీడీ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగి వెంటనే గుర్తించి తిరిగి అప్పగించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన తెలంగాణ భక్తుడు పోగొట్టుకున్న విలువైన బ్యాగ్‌ను టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి గుర్తించారు. ఆ బ్యాగులో ఉన్న డబ్బులు, బంగారం, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను తిరిగి భక్తుడికి జాగ్రత్తగా అప్పగించారు. తెలంగాణకు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు మేదరమిట్ట నుంచి గోగర్భ డ్యాం సమీపంలోని మఠాలకు మహేంద్ర టాక్సీ జీప్‌లో ప్రయాణించారు. ఆ సమయంలో తమ బ్యాగ్‌ను వాహనంలోనే మరిచిపోయారు.. వెంటనే రామకృష్ణ ఈ విషయాన్ని గుర్తించి టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే సీసీటీవీ ప్లేబ్యాక్ ఫుటేజీలను పరిశీలించారు.. భక్తుడు ప్రయాణించిన జీప్‌ను గుర్తించారు. అప్పటికే తిరుపతికి చేరుకున్న డ్రైవర్‌ను సంప్రదించి బ్యాగ్‌ను జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భక్తుల సమక్షంలో బ్యాగ్‌ను తెరిచి అందులోని విలువైన వస్తువులను ధృవీకరించి యథాతథంగా అప్పగించారు. భక్తుడి బ్యాగులో రూ.23,000 డబ్బులు, 4 గ్రాముల బంగారు ఉంగరం, 12 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల వెండి కాళ్ల పట్టీలు, ఒప్పో మొబైల్, సుమారు రూ.1.20 లక్షల విలువైన ఓ దంత పరికరం ఉంది. బ్యాగును జాగ్రత్తగా తిరిగి తమకు అప్పగించినందుకు భక్తుడు రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు, విజిలెన్స్