తిరుమల అలిపిరి మెట్ల
Actor ProfilePolitician

తిరుమల అలిపిరి మెట్ల

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources2
తిరుమల అలిపిరి మెట్లపై సిగరెట్ తాగుతూ వ్యక్తి హల్ చల్
TeluguOne29 Dec 2026
తిరుమల అలిపిరి మెట్లపై సిగరెట్ తాగుతూ వ్యక్తి హల్ చల్

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా మరొక ఘటన వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి మెట్ల మార్గంలో ఒక వ్యక్తి యథేచ్ఛగా సిగరెట్ తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో భక్తులు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల కొండకు కాలినడకన వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో దాదాపు 2,600వ మెట్టు సమీపంలో ఒక వ్యక్తి కూర్చొని ధూమపానం చేస్తున్న వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తిరుమల పరిసరాల్లోకి సిగరెట్లు, బీడీలు వంటి నిషేధిత వస్తువులు ఎలా వస్తున్నాయంటూ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై టీటీడీ యంత్రాంగాన్ని వైసీపీ తీవ్రస్థాయిలో నిలదీసింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భద్రత మరియు తనిఖీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తీవ్రంగా విఫలమయ్యాయని ఆరోపించింది. ప్రత్యేకంగా టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడును లక్ష్యంగా చేసుకుంటూ విపక్షాలు ఘాటు విమర్శలు గుప్పించాయి. తనకు ఇతర వ్యాపారాలు ఉన్నాయని, ఇదొక్కటే పని కాదని వ్యాఖ్యానించిన వ్యక్తిని దేవస్థానం ఛైర్మన్‌గా నియమించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా అలిపిరి తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత వస్తువులు కొండపైకి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టడంలో టీటీడీ భద్రతా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ రకమైన ఘటనలు ఆధ్యాత్మిక వాతావరణానికి హాని కలిగిస్తాయని, తిరుమల క్షేత్ర మహత్యాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా తనిఖీలను తక్షణమే సమీక్షించాలని డిమాండ్ చేశారు. తాజా ఘటనపై సాధారణ భక్తుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు కొండపై ప్రతిపాదిత తనిఖీ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలని

బోటు బోల్తా ఘటన.. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేశ్
Eenadu28 Oct 2026
బోటు బోల్తా ఘటన.. భారత ఎంబసీ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేశ్

అమరావతి: వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో ఏపీ వాసులు మృతి చెందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. భాధితులకు తక్షణ సాయం అందేలా

సాయికృష్ణ మృతి వ్యవహారంపై సుప్రీంకోర్టుకు రాష్ట్రప్రభుత్వం
Eenadu27 Oct 2026
సాయికృష్ణ మృతి వ్యవహారంపై సుప్రీంకోర్టుకు రాష్ట్రప్రభుత్వం

అమరావతి: విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకున్న నిబంధనలపై హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర

తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలోకి అనుమతించని తితిదే
Eenadu27 Oct 2026
తిరుమలలో భక్తుల రద్దీ.. క్యూలైన్లలోకి అనుమతించని తితిదే

తిరుమల: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ కూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో రుయా