
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fire accident in Railway CRS Scrap Yard: తిరుపతి జిల్లాలోని రేణి గుంటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్‌లో అగ్నిప్రమాదంతో క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా కమ్ముకున్నాయి. అగ్నికీలలు ఎగసిపడటంతో రైల్వే సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో రైల్వే అధికారులు అప్రమత్తమైన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టారు. పలు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా..మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్‌లోని సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఘటన స్థలాన్ని రైల్వే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. వ్యర్థాల దహనం కారణంగానే మంటలు చెలరేగాయా..? అనే కోణంలో పరిశీలన చేపట్టారు. షాప్ పరిసరాల్లో భద్రతా చర్యలను అధికారులు సమీక్షిస్తున్నారు. Read more: Tirumala: భక్తులతో కిట కిటలాడుతున్న తిరుమల.. అలిపిరి టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.!. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారనే వివరాల సేకరణ చేపట్టారు. ప్రాణనష్టం జరిగిందా..? ఆస్తి నష్టం ఎంత మేరకు ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రేణిగుంట CRS ప్రాంతంలో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారుల ప్రకటన తర్వాత వెల్లడయ్యే అవకాశంఉంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు