తిరుచానూరు అమ్మవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆన్ లైన్ లో శ్రీ వరలక్ష్మీ వ్రతం టికెట్లు
Actor ProfilePolitician

తిరుచానూరు అమ్మవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆన్ లైన్ లో శ్రీ వరలక్ష్మీ వ్రతం టికెట్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుచానూరు అమ్మవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆన్ లైన్ లో శ్రీ వరలక్ష్మీ వ్రతం టికెట్లు
Zee Telugu13 Dec 2026
తిరుచానూరు అమ్మవారి భక్తులకు అలర్ట్.. నేడే ఆన్ లైన్ లో శ్రీ వరలక్ష్మీ వ్రతం టికెట్లు

Varalakshmi Vratam Arrangments In Tiruchanur: శ్రావణమాసం నేటి నుంచి ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో ఈ మాసంలో అత్యంత విశేషమైన పండుగలు వస్తాయి. అయితే, ఈ నెలలో రెండో శుక్రవారం ఆగష్టు 21వ తేదీ వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నీ ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన టిక్కెట్లను కూడా ఆగష్టు 13వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. తిరుచానూరులో శ్రీ పద్మావతి ఆలయంలో అమ్మవారి ఆలయంలో ఆగష్టు 21న నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వరలక్ష్మీ వ్రతం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానితో కలిసి టీటీడీ జేఈఓ శరత్‌ కుమార్ సమావేశం నిర్వహించారు. ఆగష్టు 21న శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ఇక అదే రోజు సాయంత్రం అమ్మవార్లను స్వర్ణరథంపై నాలుగు మాఢవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆస్థానమండంపం పరిసరాలను పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించి, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది, పార్కింగ్‌ సమస్యలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జేఈఓ ఆదేశించారు. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఈరోజు ఉదయం 10 గంటలకే విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఆఫ్‌లైన్‌ టిక్కెట్లు ఒక రోజు ముందు విడుదల చేస్తారు. శ్రావణపౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు