
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌పై అడుగులేశాయి. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికైంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, చేనేత చీరలు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, అడుగుల్లోని ధీమా చూసి సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ హాజరై, చేనేత వారసత్వ గొప్పదనాన్ని చాటిచెప్పిన వారిని ప్రశంసించారు.నక్సల్ రహిత బస్తర్.. అభివృద్ధిపై దృష్టిదాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవలే సీఎం విష్ణు దేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. బస్తర్ అభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. సమావేశం అనంతరం సీఎం సాయ్ మాట్లాడుతూ.. "సుమారు 40-50 ఏళ్ల తర్వాత బస్తర్ ప్రాంతం నక్సల్ రహితంగా మారింది. ఇప్పుడు అక్కడ అభివృద్ధి చాలా అవసరం. ముఖ్యంగా కనెక్టివిటీని మెరుగుపరచాల్సి ఉంది" అని తెలిపారు.భద్రతా బలగాల విజయాలుఒకప్పుడు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్‌గా నిలిచిన బస్తర్ ప్రాంతం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి వ్యూహాత్మక కేంద్రంగా