
అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. సాయంత్రం పూట ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తామన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని.. అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాకపోవడమేంటన్నారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని.. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు