తండ్రి ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు.. మామూలు స్కెచ్ వేయలే కదా
Actor ProfilePolitician

తండ్రి ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు.. మామూలు స్కెచ్ వేయలే కదా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తండ్రి ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు.. మామూలు స్కెచ్ వేయలే కదా
Samayam Telugu24 Oct 2026
తండ్రి ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు.. మామూలు స్కెచ్ వేయలే కదా

తండ్రి ఉద్యోగం కోసం తల్లిని చంపిన కూతురు.. మామూలు స్కెచ్ వేయలే కదా! ప్రభుత్వ ఉద్యోగం.. అలాగే ఆస్తి కోసం.. ఓ కన్న కూతురు ఏకంగా తల్లినే చంపేసింది. ఈ దారుణం బయటపడకుండా కవర్ చేయడానికి దానిని యాక్సిడెంట్‌గా చిత్రీకరించింది. కానీ, చివరకు అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ దారుణ సంఘటన జరిగింది. జైపూర్‌లోని ప్రతాప్ నగర్‌లో ఉండే.. 23 ఏళ్ల ఆయుషి శర్మ అనే.. లా ఫైనల్ ఇయర్ విద్యార్థిని.. తన సొంత తల్లి నీరజ్ శర్మను కారుతో గుద్దిందించి ప్రమాదంగా చిత్రీకరించింది. ఏడాది క్రితం కోర్టులో L.D.Cగా పనిచేసే.. ఆయుషి తండ్రి విజయ్ కుమార్ శర్మ మరణించారు. అయితే, ఆయన స్థానంలో కారుణ్య నియామకం కింద.. ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి రావాలనే విషయంలో... తల్లికూతుళ్ల మధ్య వివాదం మొదలైంది. ఆయుషి ఆ ఉద్యోగం తనకే కావాలని కోరగా.. ఆమె తల్లి మాత్రం.. మానసిక వికలాంగుడైన తన కొడుకుకు... ఆ ఉద్యోగాన్ని ఇప్పించింది. దీంతో పాటు జైపూర్‌లోని ఆస్తి విషయమై.. ఇద్దరి మధ్య రోజువారీ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. తన భవిష్యత్తును తల్లి నాశనం చేసిందనే పగతో.. ఆయుషి ఇల్లు వదిలిపెట్టి.. టోంక్ రోడ్డులోని తన బాబాయ్ కొడుకు బలరామ్ అలియాస్.. రవితో కలిసి జీవించడం ప్రారంభించింది. అక్కడే వారిద్దరూ కలిసి తల్లిని వదిలించుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ కుట్రలో భాగంగా బలరామ్ తన తండ్రి మోహన్ స్వరూప్‌ను కూడా భాగస్వామిని చేశాడు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి