తాడిపత్రిలో పోటాపోటీ ప్రదర్శనలు.. అప్రమత్తమైన పోలీసులు
Actor ProfilePolitician

తాడిపత్రిలో పోటాపోటీ ప్రదర్శనలు.. అప్రమత్తమైన పోలీసులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాడిపత్రిలో పోటాపోటీ ప్రదర్శనలు.. అప్రమత్తమైన పోలీసులు
Eenadu25 Nov 2026
తాడిపత్రిలో పోటాపోటీ ప్రదర్శనలు.. అప్రమత్తమైన పోలీసులు

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా, వైకాపా పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైకాపా ర్యాలీకి పిలుపునిచ్చింది. ర్యాలీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆహ్వానించారు. మరో వైపు ఇంటంటికి తెదేపా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీల కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇంట్లో నుంచి వెలుపలికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన లోపలికి వెళ్లాలని హెచ్చరించారు. డీఎస్సీపై నిరసనల నేపథ్యంలో విశాఖలోని జగదాంబ జంక్షన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైకాపా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు