తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన
Actor ProfilePolitician

తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన
HMTV31 Dec 2026
తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన

Thottambedu: తొట్టంబేడు మండలంలో విజిబుల్ పోలీసింగ్ అవగాహన తొట్టంబేడు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఈ రోజు సాయంత్రం BN కండ్రిగ సర్కిల్ సీఐ శ్రీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్సై శ్రీ బాలకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది ప్రభాకర్, ప్రతాప్ కలిసి కాసరం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రాబోయే వినాయక చవితి పండుగ, పంచాయతీ ఎన్నికలు, మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, బాల్యవివాహాల నిరోధం, నూతన చట్టాలు, డయల్ 112 తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయానికి సంబంధించిన సమాచారం, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రజలు పోలీసులతో సమన్వయంతో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు