తాజ్ మహల్ వివాదం.. కేంద్రం
Actor ProfilePolitician

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం
Andhra Jyothy28 Sept 2026
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ నేపథ్యంలో దేవాలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్టు బోర్డు తాజాగా ఆమోదించింది. ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు నేపథ్యంలో దేవాలయ

తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు
Andhra Jyothy27 Sept 2026
తాజ్ మహల్ వివాదం.. కేంద్రం, ఏఎస్ఐకు హైకోర్టు నోటీసులు

తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్: తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 'తేజో మహాలయ' పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాలుగో ప్రతివాది పంకజ్ కుమార్ వర్మాకు కూడా నోటీసులు పంపింది. తాజ్ మహల్ ప్రాంగణంలో శివాలయం ఉందని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. 'అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ తేజో మహాలయ' ఆలయానికి సంబంధించిన అంశంపై హిందూ పక్షం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ లోపల సర్వే నిర్వహించేందుకు, ఫొటోగ్రఫీకి అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇంతకుముందు ఇదే కేసులో సర్వే నిర్వహించాలన్న విజ్ఞప్తిని ఆగ్రా జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది హరి శంకర్ జైన్.. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ నుంచి వివరణ కోరింది. కేంద్ర ప్రభుత్వం, ఏఎస్ఐ దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్ల ఆధారంగా తాజ్ మహల్‌లో సర్వేకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. హర్యానాలో దారుణ ఘటన.. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి.. మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు