తాజ్ మహల్ లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం
Actor ProfilePolitician

తాజ్ మహల్ లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాజ్ మహల్ లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం, ఏఎస్ఐలకు నోటీసులు
10TV Telugu2 Oct 2026
తాజ్ మహల్ లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం, ఏఎస్ఐలకు నోటీసులు

తాజ్ మహల్‌లో శివాలయం పిటిషన్ కేంద్రం, ఏఎస్ఐలకు కోర్టు నోటీసులు శాస్త్రీయ ఆధారాల కోసం డిమాండ్ Taj Mahal: ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రాంగణం లోపల 'తేజో మహాలయ' (అగ్రేశ్వర్ మహాదేవ్ నగ్నథేశ్వర్ విరాజమాన్) ఆలయం ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. హరి శంకర్ జైన్‌తో పాటు మరో నలుగురు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం.. వివాదాస్పద ప్రాంగణంలో సర్వే, ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ కోసం అడ్వకేట్ కమిషనర్‌ను నియమించే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు నోటీసులు జారీ చేసింది. Nethannaku Bharosa: నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి రూ.25,000 శాస్త్రీయ ఆధారాలు అవసరమంటున్న పిటిషనర్లు: కట్టడం యొక్క వాస్తవ నిర్మాణ శైలిని, అంతర్గత లక్షణాలను రికార్డు చేయడం అత్యవసరమని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఇలాంటి చారిత్రక వివాదాల్లో కేవలం మౌఖిక సాక్ష్యాలు సరిపోవని, శాస్త్రీయ ఆధారాలు అవసరమని వారు స్పష్టం చేశారు. గతంలో అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. స్థానిక పరిస్థితులను నిష్పక్షపాతంగా అంచనా వేసేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించే పూర్తి అధికారం న్యాయస్థానాలకు ఉందని వారు గుర్తుచేశారు. ఒక దశాబ్దంగా నడుస్తున్న చట్టపరమైన పోరాటం: తేజో మహాలయ(Taj Mahal) వివాదంపై చట్టపరమైన పోరాటం ఈనాటిది కాదు; 2015లోనే ఆగ్రా సివిల్ కోర్టులో దీనిపై తొలిసారిగా దావా వేశారు. ఆ తర్వాత కట్టడం తనిఖీ కోసం వేసిన పిటిషన్లను దిగువ కోర్టులతో పాటు, అదనపు జిల్లా జడ్జి కోర్టు కూడా తిరస్కరించాయి. అసలు వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక విచారణ అవసరమా లేదా అన్న కనీస అంశాన్ని పరిశీలించకుండానే కింది కోర్టులు నిర్ణయం తీసుకున్నాయని పిటిషనర్లు ఆరోపించడంతో, ఇప్పుడు ఈ సుదీర్ఘ వివాదం అలహాబాద్ హైకోర్టు పరిధిలోకి వచ్చింది