డ్రాగన్ కి బ్రేక్
Actor ProfileActor

డ్రాగన్ కి బ్రేక్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డ్రాగన్ కి బ్రేక్, సలార్ 2 పనులు మొదలు! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema24 Dec 2026
డ్రాగన్ కి బ్రేక్, సలార్ 2 పనులు మొదలు! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఇటీవల ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. డిశ్చార్జ్ అయ్యారు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రెండు నెలల వరకు ఎలాంటి బరువైన పనులు చెయ్యకూడదు. అంటే షూటింగ్ లో పాల్గొన కూడదు. నవంబర్ తర్వాతే ఎన్టీఆర్ తన తాజా చిత్రం షూటింగ్ కి వచ్చే అవకాశం ఉంది. అందుకే, దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తాను ఎన్టీఆర్ తో తీస్తున్న “డ్రాగన్” (Dragon) చిత్రం షూటింగ్ ని నిలిపివేశాడు. మొన్నటి వరకు హీరోతో అవసరంలేని సీన్లు తీశారు. కానీ ఇప్పుడు మొత్తంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ పూర్తి స్థాయిలో షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కావొచ్చు. దాంతో, ఈ గ్యాప్ లో ఖాళీగా ఉండకుండా ప్రశాంత్ నీల్ తన “సలార్ 2” (Salaar 2) సినిమా పనులు మొదలుపెడ్తున్నట్టు సమాచారం. ప్రభాస్ హీరోగా నీల్ తీసిన “సలార్” భారీ విజయం సాధించింది. అప్పుడే రెండో భాగం ప్రకటించారు. ఐతే, ప్రభాస్ తనకున్న ఇతర కమిట్ మెంట్స్ వల్ల వెంటనే ‘సలార్ 2’ చేసేందుకు ఒప్పుకోలేదు. సో, ఈ లోపు ఎన్టీఆర్ తో సినిమా తీసి వస్తానని ప్రభాస్ కి చెప్పి ‘డ్రాగన్’ షూటింగ్ మొదలుపెట్టాడు. నిజానికి ‘డ్రాగన్’ సినిమాని జూన్ 2026కి విడుదల చేద్దామనుకున్నారు. కానీ ఆ విడుదల ఇప్పుడు జూన్ 2027కి వెళ్ళింది. సో, ఇప్పుడు ‘సలార్ 2’ స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు నీల్. ఈ సినిమాకి సంబంధించిన కొంత భాగం ఇప్పటికే చిత్రీకరించారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఆలస్యం లేకుండా ‘సలార్ 2’ స్టార్ట్ చేస్తారట