డెబ్యూ టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురు టీమిండియా ప్లేయర్ల స్టోరీ తెలిస్తే పాపం అనాల్సిందే
Actor ProfileActor

డెబ్యూ టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురు టీమిండియా ప్లేయర్ల స్టోరీ తెలిస్తే పాపం అనాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డెబ్యూ టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురు టీమిండియా ప్లేయర్ల స్టోరీ తెలిస్తే పాపం అనాల్సిందే
TV9 Telugu6 Dec 2026
డెబ్యూ టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురు టీమిండియా ప్లేయర్ల స్టోరీ తెలిస్తే పాపం అనాల్సిందే

Indian Players Debut Last Test Match: భారత టెస్టు క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన క్యాప్ అందుకోవడం ప్రతీ క్రీడాకారుడి కల. అయితే కొందరు ఆటగాళ్లకు ఆ కల నెరవేరిన మరుక్షణమే చేజారిపోయింది. అరంగేట్రం చేసిన ఏకైక టెస్టు మ్యాచ్ చివరి మ్యాచ్‌గా మారి, మళ్లీ ఎప్పటికీ రెడ్ బాల్ క్రికెట్‌లో అవకాశం రాని ఐదుగురు క్రికెటర్ల చేదు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత క్రికెట్ జట్టు 1932 నుంచి ఇప్పటివరకు వందలాది టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఎంతో మంది దిగ్గజాలు టీమిండియా వైపు నుంచి కొన్ని వందల మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 12 మంది ఆటగాళ్లు వందకు పైగా టెస్టులు ఆడి రికార్డు సృష్టించారు. కొందరికి మాత్రం కాలం సహకరించలేదు. తొలి మ్యాచ్‌లోనే పొరపాట్లు జరగడం, అనుకోకుండా గాయాల బారిన పడటం వల్ల ఒకే ఒక్క మ్యాచ్‌తో అంతర్జాతీయ రెడ్ బాల్ కెరీర్‌కు మంగళం పాడాల్సి వచ్చింది. యోగ్‌రాజ్ సింగ్ నుంచి సబా కరీమ్ వరకు..: యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ 1981లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వెల్లింగ్‌టన్‌లో టెస్టు అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన తర్వాత ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఆయన, ఆ తర్వాత తీవ్రమైన గాయాలు, ఫామ్ లేమి వల్ల మళ్లీ కనీసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీమ్ కథ మరింత దారుణమైనది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌పై వికెట్ కీపింగ్ చేస్తూ కంటికి తీవ్రమైన దెబ్బ తగలడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అదే ఏడాది టెస్టు డెబ్యూ చేసినప్పటికీ, కంటి చూపు సమస్యలు తగ్గకపోవడంతో ఒకే ఒక్క టెస్టులో 15 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. గబ్బా హీరో నటరాజన్, లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ..: 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక గబ్బా టెస్టులో అరంగేట్రం చేసిన