
ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ఫాంటసీ ఎంటర్ టైనర్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ నుంచి 'కేక్ వాక్' సాంగ్ వీడియో విడుదలైంది. దీనిని కాలభైరవ స్వరపరిచారు. విలక్షణ పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఫహద్ ఫాజిల్. 'పుష్ప' సినిమాతో తెలుగువారికీ చేరువయ్యాడీ మలయాళ స్టార్ హీరో. ప్రస్తుతం తెలుగులో ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అనే మూవీలో నటిస్తున్నాడు. ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలిసి రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' నుంచి 'కేకు వాకు' అనే వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాల భైరవ సంగీత సారథ్యంలో స్వరపరిచిన ఈ పాట సూరి అనే పాత్రను, అతని పిచ్చితనాన్ని ఓ ప్రత్యేకమైన సెటప్‌లో పరిచయం చేస్తుంది. కాల భైరవ, ఫహాద్ ఫాసిల్, సారా కలయికలో ఈ ప్రత్యేక మ్యూజిక్ వీడియోను మేకర్స్ రూపొందించారు. ముందు కూల్‌గా ప్రారంభమైన ఈ పాట.. కాల భైరవ తన థంపింగ్ బీట్స్‌తో ఎంట్రీ ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయి వాకీ మోడ్‌లోకి మారుతుంది. యువ సంగీత దర్శకుడు ఇచ్చిన ఈ ఎనర్జిటిక్ కంపోజిషన్ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఆయన స్టెప్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి. కాల భైరవ, ఎంసీ హరి కలిసి ఈ పాటకు క్యాచీ లిరిక్స్ అందించారు. సూరి డేర్‌డెవిల్ స్వభావాన్ని, అతనికి ప్రతి పని ఎంత ఈజీగా ‘కేక్‌వాక్’లా ఉంటుందనే విషయాన్ని చక్కటి పదాలతో హైలైట్ చేశారు. వీరిద్దరూ పాటను ఎనర్జీతో పాడుతూ మరింత స్పెషల్ అనిపించేలా చేశారు. ఈ ఫాంటసీ ఎంటర్ టైనర్ సెప్టెంబర్ 11న జనం ముందుకు రాబోతోంది. Tollywood: సీనియర్ నట