డిజిటల్ స్క్రీన్ లకూ సెన్సార్ కత్తెర?.. ఓటీటీ సినిమాల
Actor ProfileActor

డిజిటల్ స్క్రీన్ లకూ సెన్సార్ కత్తెర?.. ఓటీటీ సినిమాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిజిటల్ స్క్రీన్ లకూ సెన్సార్ కత్తెర?.. ఓటీటీ సినిమాలపై కేంద్రం కీలక నిర్ణయం
Samayam Telugu27 Oct 2026
డిజిటల్ స్క్రీన్ లకూ సెన్సార్ కత్తెర?.. ఓటీటీ సినిమాలపై కేంద్రం కీలక నిర్ణయం

చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు మాత్రమే పరిమితమైన సెన్సార్ బోర్డు (CBFC) నిబంధనలు, ఇకపై డిజిటల్ ప్రపంచానికి కూడా విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్‌పై కఠినమైన సెన్సార్‌షిప్ నిబంధనలను తీసుకురావాలని భారత ప్రభుత్వం చాలా కాలంగా యోచిస్తోంది. అయితే తాజాగా చోటుచేసుకున్న ఓ పంజాబీ చిత్ర వివాదం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా కనిపిస్తోంది. ప్రముఖ సింగర్ కమ్ యాక్టర్ దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సట్లెజ్’ (Satluj) సినిమా చుట్టూ ముసిరిన వివాదమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అసలేమిటీ ‘సట్లెజ్’ వివాదందర్శకుడు హనీ ట్రెహన్ తెరకెక్కించిన ఈ చిత్రం పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా రూపొందింది. 1980, 90ల కాలంలో పంజాబ్‌లో జరిగిన కొన్ని వివాదాస్పద అపహరణలు, అక్రమ కాల్పుల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుంది. 2022లో ఈ చిత్రాన్ని ‘పంజాబ్ 95’ అనే అసలు పేరుతో థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ సినిమాలోని కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, ఏకంగా 127 కట్స్ విధించడంతో పాటు సినిమా పేరును కూడా మార్చాలని ఆదేశించింది. ఇన్ని కత్తెర్ల మధ్య సినిమాను విడుదల చేయడం ఇష్టం లేని మేకర్స్, థియేట్రికల్ విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు CBFC సర్టిఫికేషన్ అవసరం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా ‘జీ5’ ఓటీటీ వేదికగా ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేశారు.* నా కో స్టార్ట్స్‌లో అతనొక్కడే సింగిల్.. సిగ్గుపడుతూ మనసులో మాట చెప్పిన భాగ్యశ్రీకేంద్రం సీరియస్పంజాబ్ సాంస్కృతిక, రాజకీయ చరిత్రలోని అత్యంత సున్నితమైన అంశంతో ముడిపడి ఉన్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన వెంటనే విపరీతమైన ఆదరణ పొందింది