డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే
Actor ProfilePolitician

డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే
Andhra Jyothy13 Jan 2027
డిగ్రీ పూర్తయినా.. పట్టా రాలే

హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్‌ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్‌ మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న యాజమాన్యాలు పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు సర్కారు ఇవ్వకపోవటంతో విద్యార్థులను అడుగుతున్న కాలేజీలు సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న రెండు లక్షల మంది విద్యార్థులు మంచి ర్యాంకులు వచ్చినా ఉన్నత చదువుల కోసం వెళ్లలేని పరిస్థితి ప్రభుత్వం తక్షణం చెల్లించాల్సిన బకాయిలు రూ.2,500 కోట్ల పైనే పాత బకాయిలు రూ.7,000 కోట్ల వరకు ఉంటాయంటున్న ఫాతీ హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అవినాశ్‌ ఓ ప్రముఖ కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఎంటెక్‌లో ప్రవేశం కోసం పీజీఈసెట్‌ రాసి మంచి ర్యాంకు సాధించాడు.. పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ప్రొవిజినల్‌ మెమో, టీసీ, బోనఫైడ్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి. వీటిని ఇచ్చేందుకు కాలేజీ నిరాకరిస్తోంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున మూడేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 1.05 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో ఈ ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కౌన్సెలింగ్‌లో అవినాశ్‌ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమస్యనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఇతర యూజీ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెండింగులో ఉండటంతో కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ప్రభుత్వం కాలేజీలకు బకాయి పడిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం రూ.10 వేల కోట్ల వరకు ఉందని తెలంగాణ ఉన్నత విద్య ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య (ఫాతీ) అంటోంది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని ఫాతీ ఏడాది కాలంగా కోరుతోంది. గత ఏడాదిలో ప్రభుత్వం దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు విడుదల చేసింది