టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు
Actor ProfileActor

టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Asianet News Telugu27 Sept 2026
టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే

చిత్ర పరిశ్రమలోకి స్టార్ హీరోల కొడుకులు, తమ్ముళ్లు, మనవళ్లు, ఇతర కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడం సహజమే. అక్కినేని, నందమూరి, కొణిదెల, దగ్గుబాటి ఫ్యామిలీల నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. వాళ్ళ తొలి చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. చాలా మంది హీరోలు ఫస్ట్ మూవీ సక్సెస్ కావాలి అనే కోరికతో సేఫ్ గేమ్ ఆడారు. బలమైన కథతో మెప్పించిన హీరోలు మాత్రం చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు. ఆయన వారసుడిగా వచ్చిన మహేష్ బాబు తొలి చిత్రంతో సేఫ్ గేమ్ ఆడారు అనే చెప్పాలి. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన రాజకుమారుడు చిత్రం పక్కా కమర్షియల్ ప్యాకేజ్ మూవీ. కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ఎస్ఎంఎస్ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇది ఒక నార్మల్ యూత్ ఫుల్ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఎదిగిన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా కొత్త హీరోలు వచ్చారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ నిరాశపరిచింది. మేనల్లుడు అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో, తనయుడు రాంచరణ్ చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఇవి కమర్షియల్ గా సక్సెస్ కానీ దమ్మున్న సినిమాలు అయితే కాదు. వరుణ్ తేజ్ ముకుంద చిత్రంతో, సాయిధరమ్ తేజ్ రేయ్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. కానీ వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన మూవీ ఒక అద్భుతం అనే చెప్పాలి. తొలి చిత్రంతోనే సాహసోపేతమైన కథని ఎంచుకున్న వైష్ణవ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఏఎన్నార్ వారసత్వంతో నాగార్జున టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తిరుగులేని స్టార్ గా ఎదిగారు. నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇంకా టాలీవుడ్ లో స్ట్రగుల్ అవుతున్నారు