
పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ వెంటే పడుతుంది. ఒక్క హిట్ కొడితే చాలు వరుసగా అవకాశాలొస్తాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు హిట్ కొట్టారంటే ఇండస్ట్రీ అంతా ఆమె వెంట పడుతుంది. ఇప్పుడు టాలీవుడ్ కు అలాంటి మరో హీరోయిన్ దొరికేసింది. పేరు రితికా నాయక్ (Ritika Nayak). ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సినిమాతో రితికా నాయక్ హిట్ కొట్టింది. దీంతో ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. కేవలం ఒక్క సక్సెస్ తో ఆమెకు ఈ క్రేజ్ రాలేదు. ‘కొరియన్ కనకరాజు’ కంటే ముందు ఆమె ‘మిరాయి’ అనే సినిమాలో నటించింది. అది కూడా పెద్ద హిట్టయింది. అంతకంటే ముందు ‘హాయ్ నాన్న’లో క్యామియో చేసింది. ఇలా చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుసగా సక్సెస్ లున్నాయి. అందుకే రితికాను ఆఫర్లు వెదుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తన వద్దకు వచ్చిన ఆఫర్ల నుంచి మంచి కథల్ని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది రితికా. త్వరలోనే ఆమె నుంచి కొత్త సినిమాల ప్రకటనలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ భామ ‘మిరాయి 2’ (Mirai 2) ఒప్పుకొంది