ట్రంప్ తో మాట్లాడాల్సి వస్తే.. నేనేం బాధపడను
Actor ProfilePolitician

ట్రంప్ తో మాట్లాడాల్సి వస్తే.. నేనేం బాధపడను

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రంప్ తో మాట్లాడాల్సి వస్తే.. నేనేం బాధపడను
Eenadu14 Oct 2026
ట్రంప్ తో మాట్లాడాల్సి వస్తే.. నేనేం బాధపడను

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఇటీవల బహిరంగంగానే పరస్పర విమర్శలు చేసుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా వీరిద్దరూ నాటో సదస్సులో పాల్గొన్నారు. దీంతో వీరు ఎదురుపడటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, ఈ సదస్సులో ట్రంప్‌తో అంటీముట్టనట్లుగానే ఉన్న మెలోనీ.. ఆ తర్వాత దీనిపై స్పందించారు. ఒకవేళ ట్రంప్‌ (Donald Trump)తో మాట్లాడాల్సి వచ్చినా.. అందుకు తానేమీ పశ్చాత్తాపపడబోనని పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగత రాజకీయాల కంటే ఇటలీ (Italy) ప్రయోజనాలనే నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం పశ్చిమ దేశాల మధ్య ఐక్యతకు నేను మద్దతిస్తాను. ఈ క్రమంలోనే అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించాల్సి వచ్చినా నాకు సమ్మతమే. దీనికి నేనేం బాధపడట్లేదు. ఇక, ఈ సదస్సులో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ వస్తుండగా.. నన్ను కావాలనే ఎదురుగా నిలబెట్టారనే ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదు. మిగతా దేశాధినేతల మాదిరిగానే నేను అక్కడ నిల్చున్నాను. అందులో ఎలాంటి వ్యూహం లేదు’’ అని మెలోనీ వివరించారు. నాటో (NATO) దేశాధినేతల గ్రూప్‌ ఫొటో సమయంలో ట్రంప్‌ ముందునుంచి వెళ్తున్నా.. మెలోనీ ఆయన పట్టించుకోకుండా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక, నేతల డిన్నర్‌ సమయంలోనూ వీరిద్దరూ దూరందూరంగానే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఇటలీ ప్రధానితో ట్రంప్‌ గతంలో మంచి మిత్రబంధం కొనసాగించారు. ఆయన రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ప్రమాణస్వీకారానికి హాజరైన ఏకైన ఐరోపా నేత మెలోనీనే కావడం గమనార్హం. అయితే, గత కొన్ని నెలలుగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరాన్‌తో యుద్ధం విషయంలో మెలోనీ వైఖరిని ట్రంప్‌ బహిరంగంగానే విమర్శించారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సులో వీరి మధ్య ఫొటో వివాదం చెలరేగింది. ఆ సదస్సులో తనతో ఫొటో దిగేందుకు మెలోనీ ప్రాధేయపడ్డారని, అందుకే అంగీకరించానని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఇటలీ ప్రధాని