
ఇండస్ట్రీలో ప్రేమలు కామన్. హీరోయిన్లను కూడా ఒక్కోసారి హీరోలు కూడా ప్రేమలో పడుతుంటారు. అయితే కొన్ని నమ్మదగ్గ విధంగా ఉంటే, మరికొన్ని అస్సులు నమ్మశక్యం అనిపించవు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది రెండో కేటగిరీ.మల్లికా షెరావత్ (Mallika Sherwat) గుర్తుందా.. ఏళ్ల కిందటే బాలీవుడ్ కు దూరమైన ఈ భామ, తను వయసులో ఉన్నప్పుడు ఓ హాలీవుడ్ హీరో తనపై మనసు పారేసుకున్నాడని చెబుతోంది. అది కూడా వేరెవరో కాదు, స్వయానా టామ్ క్రూజ్(Tom Cruise). అవును.. ఈ ‘మిషన్ ఇంపాజిబుల్’ హీరో తనను చాలా ఇష్టపడ్డాడని, కొన్నాళ్ల పాటు ఆన్ లైన్ లో తనను ఫ్లర్ట్ చేశాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దగ్గర ఫోన్ లేదని, ఉంటే అతడు పంపించిన వీడియోల్ని ఇప్పుడే చూపించి ఉండేదాన్నని అంటోంది మల్లికా షెరావత్. ‘ది ట్రెయిటర్స్ సీజన్-2’ (The Traitors India Season 2) లో పాల్గొన్న మల్లిక ఈ ఆసక్తికర విషయాల్ని బయటపెట్టింది. టామ్ క్రూజ్ లాంటి హీరో మల్లికా వెంట పడ్డాడంటే నమ్మేలా లేదు. ఈమె వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం కూడా బహుశా అతడికి లేదేమో