
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా బంగ్లాదేశ్ పర్యటనపై ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతోంది. గతేడాది భారత జట్టు బంగ్లా టూర్‌కు వెళ్లాల్సి ఉండగా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 15 వరకు భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ షెడ్యూల్ విండోను కేటాయించింది. ఇందులో మూడు వన్డేలు సెప్టెంబరు 1, 3, 6 తేదీల్లో.. మూడు టీ20లు 9, 12, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే, కొన్నినెలల క్రితం ఇరుదేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొనడంతో ఈ టూర్‌పై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయమై తాము త్వరలో భారత ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. ప్రతిపాదిత పరిమిత ఓవర్ల సిరీస్ గురించి బీసీబీ లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో స్పష్టత వస్తుందని సదరు అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ టూర్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే సెప్టెంబర్‌లో అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుందని సమాచారం. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే అవకాశముంది. అంతేకాదు ఈ టూర్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యదేశంగా ఉంటుందని సమాచారం. ఈ సిరీస్ గానుక జరిగితే భారత గడ్డపై మ్యాచ్‌లకు ప్రత్యర్థి జట్టు అధికారికంగా ఆతిథ్య ఇవ్వడం ఇదే తొలిసారి అవుతుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో