టీడీపీ కేంద్ర కార్యాలయంలో లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమం.. టీడీపీ నేతల ఘన నివాళి
Actor ProfilePolitician

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమం.. టీడీపీ నేతల ఘన నివాళి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీడీపీ కేంద్ర కార్యాలయంలో లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమం.. టీడీపీ నేతల ఘన నివాళి
AP7AM24 Dec 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమం.. టీడీపీ నేతల ఘన నివాళి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌ బాషాకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఆయన వర్ధంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్‌జాన్‌ బాషా చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. లాల్‌జాన్‌ బాషా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఉన్నత పదవులు పొందే అవకాశం టీడీపీలో ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అందుకు లాల్‌జాన్ బాషా జీవితమే నిదర్శనమని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారికి సముచిత గౌరవం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.లాల్‌జాన్‌ బాషా చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజా సేవా దృక్పథం నేటి తరం నాయకులకు, యువతకు ఆదర్శమని పల్లా పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళుతూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారిని టీడీపీ ఎన్నటికీ మరచిపోదని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి విప్ వేపాడ చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు, ఏపీ హజ్ కమిటీ చైర్మన్