టీజీఎస్ఆర్టీసీ 'మీటికెట్'.. ఒకే యాప్ లో ఆర్టీసీ
Actor ProfilePolitician

టీజీఎస్ఆర్టీసీ 'మీటికెట్'.. ఒకే యాప్ లో ఆర్టీసీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీజీఎస్ఆర్టీసీ 'మీటికెట్'.. ఒకే యాప్ లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ బుకింగ్
AP7AM6 Jan 2027
టీజీఎస్ఆర్టీసీ 'మీటికెట్'.. ఒకే యాప్ లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ బుకింగ్

తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక ముందడుగు వేసింది. తమ 'మీటికెట్' యాప్‌‌లో సమూలంగా మార్పు చేసి, మల్టీ-మోడల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దింది. ఇకపై ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలుతో పాటు ఆటోలు, క్యాబ్‌లను కూడా ఒకే యాప్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.సోమవారం టీజీఎస్ఆర్టీసీ ఈ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ నూతన విధానం ప్రకారం, ప్రయాణికులు ఆర్టీసీ బస్సు లేదా మెట్రో రైలులో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, తమ చివరి గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన ఆటో లేదా క్యాబ్‌ను కూడా అదే యాప్‌లో ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. చెల్లింపుల ప్రక్రియ కూడా సులభతరం చేశారు. వినియోగదారులు చెల్లించిన ఛార్జీలు ఆటోమేటిక్‌గా సంబంధిత రవాణా భాగస్వాములకు బదిలీ అవుతాయి.అయితే, ఆర్టీసీ సొంతంగా ఆటోలు కొనుగోలు చేసి నడుపుతుందంటూ వస్తున్న వార్తలపై యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం గానీ, నిర్వహించడం గానీ చేయదని తేల్చిచెప్పింది. భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన లేదని పేర్కొంది. ఇది కేవలం ఇప్పటికే ఉన్న రవాణా వ్యవస్థలను అనుసంధానించే ప్రక్రియ మాత్రమేనని, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరింది. లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం ఈవీ ఆటోలు కొనే ప్రణాళిక లేదని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటీవల స్పష్టం చేశారు.ప్రయాణానికి సంబంధించిన అన్ని సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందకు తీసుకురావడమే తమ లక్ష్యమని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే మీటికెట్ యాప్‌లో ఆర్టీసీ బస్ టికెట్లు, మెట్రో, పార్కులు, దేవాలయాల టికెట్ల