టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్ .. హీరోలు వీరే
Actor ProfilePolitician

టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్ .. హీరోలు వీరే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్ .. హీరోలు వీరే
Asianet News Telugu7 Nov 2026
టీజీ20 ఛాంపియన్ గా హైదరాబాద్ .. హీరోలు వీరే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఊహించని రేంజ్‌లో ప్లాన్ చేసిన సరికొత్త ‘టీజీ20’ లీగ్ మొదటి సీజన్ ముగిసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్‌ పోరు నెక్ట్స్ లెవెల్‌లో సాగింది. టైటిల్ కోసం జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ అదిరిపోయే విక్టరీ కొట్టింది. మెగా ట్రోఫీతో పాటు ఏకంగా రూ. 1 కోటి ప్రైజ్ మనీని హైదరాబాద్ టీమ్ తన అకౌంట్‌లో వేసుకుంది. రన్నరప్ ఖమ్మం టీమ్‌కు రూ. 50 లక్షలు దక్కగా, 3వ, 4వ స్థానాల్లో నిలిచిన కరీంనగర్, రంగారెడ్డి జట్లకు చెరో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హెచ్సీఏ సెక్రటరి జీవన్ రెడ్డి పాల్గొని ప్లేయర్లను అభినందించారు. టాస్ గెలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కెప్టెన్ ఏమాత్రం ఆలోచించకుండా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం ఏసెస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఖమ్మం టీమ్‌లో స్టార్ బ్యాటర్ మికిల్ జైస్వాల్ మరోసారి సింహంలా సింగిల్‌గా పోరాడాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో విరుచుకుపడి 65 పరుగులు చేశాడు. కొడిమల హిమతేజ (31 పరుగులు) తో కలిసి మికిల్ జైస్వాల్ నాలుగో వికెట్‌కు 94 పరుగుల సూపర్ పార్ట్‌నర్‌షిప్‌ను బిల్డ్ చేశాడు. 158 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టీమ్ ఎక్కడా టెన్షన్ పడకుండా, చాలా కూల్‌గా గేమ్ ప్లాన్ అమలు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి 48 పరుగులతో టీమ్‌కు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. ఈ టోర్నీలో అభిరథ్ రెడ్డి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఒక దశలో క్రికెట్‌లో ఛాన్స్‌లు రాక అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలి