టాక్సిక్’ రన్ టైమ్ తో సర్ ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే
Actor ProfileActor

టాక్సిక్’ రన్ టైమ్ తో సర్ ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్’ రన్ టైమ్ తో సర్ ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే
123Telugu17 Dec 2026
టాక్సిక్’ రన్ టైమ్ తో సర్ ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘టాక్సిక్’ పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడటంతో ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఇప్పటికే ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేయగా, తాజాగా ఈ చిత్ర రన్‌టైమ్ రివీల్ అయింది. ఈ చిత్రానికి ఏకంగా 3 గంటల 14 నిమిషాల భారీ రన్‌టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ రేంజ్‌లో లెంగ్తీ రన్‌టైమ్ లాక్ చేసుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాలో యష్ వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా స్టార్ హీరోయిన్లు కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేయగా కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు