టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా
Actor ProfilePolitician

టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా
Sakshi18 Nov 2026
టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా

భార తీయ సినిమాలో కోలీవుడ్ సినిమా ప్రత్యేక స్థానానికి చేరుకుంది. పలు తమిళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వసూ ళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే పలువురు ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీలు తమిళంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా నుంచి ఐశ్వర్యారాయ్, దిశా పటానీ వరకు పలువురు ఉత్తరాది భామలు తమిళ చిత్రాలు చేశారు. తాజాగా మరో టాప్‌ హీరోయిన్‌ దృష్టి కోలీవుడ్‌ పై పడినట్లు సమాచారం. ఆ బ్యూటీ ఎవరో కాదు టాక్సిక్ భామ కియారా అద్వానీ. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిమణుల్లో ఈమె ఒకరు. 2014లో ఫగ్లీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు భారీ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. హిందీ చిత్రాలు నటిస్తూనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ మహేష్‌ బాబుకు జంటగా భరత్‌ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన గేమ్‌ ఛేంజర్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌తో జత కట్టారు. తాజాగా ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి టాక్సిక్‌ చిత్రంలో యష్‌కు జంటగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇలా దక్షిణాదిలో తెలుగు, కన్నడం ప్రేక్షకులకు దగ్గరైన కియార అద్వానీ దృష్టి ఇప్పుడు కోలీవుడ్‌పై పడినట్లు సమాచారం. ఒక తమిళ ప్రముఖ నటుడు ఈమెను కోలీవుడుకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కథను కూడా చెప్పినట్లు, అందులో నటించడానికి కియారా అద్వానీ సుముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి