టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్
Actor ProfileActor

టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్
123Telugu30 Nov 2026
టాక్సిక్’ తెలుగు వెర్షన్ డామినేషన్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ అలాగే తారా సుతారియా, హుమా ఖురేషి హీరోయిన్స్ గా నయనతార మరో ముఖ్య పాత్రలో నటించిన భారీ చిత్రమే ‘టాక్సిక్’. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ చిత్రం గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే ఆల్రెడీ యూఎస్ మార్కెట్ లో ప్రీమియర్స్ బుకింగ్స్ తెరుచుకున్న ఈ సినిమాకి ఆల్రెడీ తెలుగు వెర్షన్ లోనే డామినేషన్ కనపడుతున్నట్టు తెలుస్తుంది. కన్నడ, తెలుగు భాషల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఇందులో తెలుగు వెర్షన్ కే ప్రస్తుతం లీడ్ కనిపిస్తుందట. దీనితో టాక్సిక్ చిత్రం తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఫైనల్ సేల్స్ లో ఏ వెర్షన్ కి ఎక్కువ వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా యష్ మరియు కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఆగష్టు 26న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది