టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత
Actor ProfilePolitician

టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత
TeluguOne4 Oct 2026
టీఆర్ఎస్ కోసం హస్తిన హైకోర్టుకు కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) పేరు ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ పేరు ఖరారు విషయంలో పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె న్యాయపోరాటానికి దిగారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా టీఆర్ఎస్ అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న.. లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు