ఝార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన.. అసెంబ్లీ మార్చ్ కు పిలుపు
Actor ProfilePolitician

ఝార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన.. అసెంబ్లీ మార్చ్ కు పిలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఝార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన.. అసెంబ్లీ మార్చ్ కు పిలుపు
Andhra Jyothy24 Nov 2026
ఝార్ఖండ్ లో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన.. అసెంబ్లీ మార్చ్ కు పిలుపు

ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై సీఐడీ, ఈడీ విచారణలకు ప్రభుత్వం అంగీకరించినా.. విద్యార్థులు ఆందోళన విరమించటం లేదు. రాంచీ, ఆగస్టు 10: ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలపై సీఐడీ, ఈడీ విచారణలకు ప్రభుత్వం అంగీకరించినా.. విద్యార్థులు ఆందోళన విరమించటం లేదు. అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం శాంతియుత అసెంబ్లీ మార్చ్‌కు విద్యార్థులు పిలుపునిచ్చారు. నిరసనల నేపథ్యంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఆందోళనకారుల 98 శాతం డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. ఆరోపణలు వచ్చిన 3 పరీక్షలను రద్దు చేసింది. అంతేకాదు.. జేపీఎస్‌సీకి చెందిన ముగ్గురు సభ్యులు అజితా భట్టాచార్య, అనిమా హన్స్ దా, జమాల్ అహ్మద్ తమ పదవులకు రాజీనామా చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ వారి రాజీనామాలను ఆమోదించారు. అక్రమాలపై సీఐడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లతో విచారణ జరిపిస్తామని, రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో జుడీషియల్ కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, విద్యార్థులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ సంస్థలపై నమ్మకం లేదని, ఖచ్చితంగా సీబీఐ దర్యాప్తు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి