ఝార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి..300మంది
Actor ProfilePolitician

ఝార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి..300మంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఝార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి..300మందిపై కేసు
Andhra Jyothy17 Dec 2026
ఝార్ఖండ్ అసెంబ్లీ ముట్టడి..300మందిపై కేసు

ఝార్ఖండ్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై.. రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన... రాంచీ, ఆగస్టు 13: ఝార్ఖండ్‌ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై.. రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఘటనలో దాదాపు 300మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆగస్టు 10న నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో ఈ చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించడం, పోలీసులపై దాడి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. అసెంబ్లీ వద్ద విధులు నిర్వర్తించిన మెజిస్ట్రేట్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. హింసకు పాల్పడిన వారిని గుర్తించేందుకు వీడియో క్లిప్పింగులు, సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు.. అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు