జనాభా.. పెద్ద సవాల్
Actor ProfilePolitician

జనాభా.. పెద్ద సవాల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జనాభా.. పెద్ద సవాల్
Andhra Jyothy26 Oct 2026
జనాభా.. పెద్ద సవాల్

అభివృద్ధికి నియంత్రణ ఒక్కటే మార్గం నేడు ప్రపంచ జనాభా దినోత్సవం తాండూరు(వికారాబాద్): వనరులు సరిపడేలా నిర్వహించుకోవాలంటే జనాభ నియంత్రణ తప్పనిసరి. జనాభా పెరిగితే సవాళ్లు తప్పవు. పరిధికి మించిన జనాభా ఉంటే అభివృద్ధి కూడా అసాధ్యం. జనాభా పెరుగదల పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ప్రతీ మహిళకు ఇద్దరు పిల్లలు చొప్పున ఫెల్టిలిటీ రేట్‌ ఉంది. నేడు(జూలై 11) శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల- సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అలాగే కుటుంబ నియంత్రణపైనే కాకుండా ఆరోగ్య సేవలు, లైంగిక సమానత్వం, విద్య, మహిళ భద్రత వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అవగాహన తప్పనిసరి జనాభాను నియంత్రించడానికి 1989 సంవత్సరంలో ఫ్యామిలీ ప్లానింగ్‌ అనే విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. దీంతో ప్రతీ ఏడాది జూలై 11వ తేదీన జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనిపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తుంటాయి. కాగా, 2026 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక థీమ్‌ను నిర్ణయించారు. అది ‘నేడు, భవిష్యత్తులో యువత ఆశలు, ఆశయాలను సాకారం చేయడం’గా నిర్ణయించారు. కాగా, తాండూరు పట్టణంలో 91,870.. వికారాబాద్‌ పట్టణంలో 82,349.. పరిగి పట్టణంలో 31,838.. కొడంగల్‌ పట్టణంలో 23,786 చొప్పున జనాభా ఉన్నారు. స్థిరమైన జనాభాతోనే అభివృద్ధి స్థిరమైన జనాభా పెరుగుదల అభివృద్ధికి సూచిక. కొన్ని దేశాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉండి యువత సంఖ్య తక్కువగా ఉంటోంది. మరికొన్ని దేశాల్లో యువత ఎక్కువగా ఉండి వృద్ధుల సంఖ్య తక్కువగా ఉంటోంది. శ్రామిక జన సంఖ్యలో హెచ్చుతగ్గులు అభివృద్ధి సాధనను సందిగ్ధం చేస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు, విద్య, వైద్యం, పోషకాహారం, శిక్షణ, సంక్షేమం, భద్రతతో కూడిన అవకాశాలు పాలకులు కల్పించినప్పుడే యువత సన్మార్గంలో ముందుకు సాగుతుంది. ప్రపంచీకరణలో