జన నాయగన్' సెన్సార్ సర్టిఫికెట్ అంతా ఉత్తిదే.. రూమర్ల
Actor ProfilePolitician

జన నాయగన్' సెన్సార్ సర్టిఫికెట్ అంతా ఉత్తిదే.. రూమర్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జన నాయగన్' సెన్సార్ సర్టిఫికెట్ అంతా ఉత్తిదే.. రూమర్లపై మేకర్స్ క్లారిటీ
Samayam Telugu7 Oct 2026
జన నాయగన్' సెన్సార్ సర్టిఫికెట్ అంతా ఉత్తిదే.. రూమర్లపై మేకర్స్ క్లారిటీ

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ జన నాయగన్ ’ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టత నిచ్చింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయిందని, బోర్డు దీనికి ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ కేటాయించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ తేల్చి చెప్పారు. నెట్టింట నకిలీ సర్టిఫికెట్ వైరల్ గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సార్ సర్టిఫికెట్, కొన్ని కట్స్‌తో కూడిన వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారాన్ని నమ్మిన నెటిజన్లు, అభిమానులు సినిమా జులై 23న విడుదల కాబోతోందంటూ పోస్టులు పెట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నెట్టింట వైరల్ అవుతోన్న ఆ సర్టిఫికెట్ పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. అసలు విషయం ఇదీ..సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారని, ప్రస్తుతం తాము ఆ కట్స్‌ను తొలగించే పనిలోనే ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఆ పనులన్నీ పూర్తయిన తర్వాతే చిత్రాన్ని మరోసారి అధికారికంగా సెన్సార్ పరిశీలనకు పంపనున్నట్లు వెల్లడించారు. అప్పటివరకు ఇలాంటి అనాధికారిక వార్తలను, రూమర్లను నమ్మవద్దని, వాటిని స్ప్రెడ్ చేయవద్దని అభిమానులను కోరారు. కొనసాగుతున్న నిరీక్షణరాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన విజయ్‌కి ఇదే చివరి సినిమా కావడంతో ‘జన నాయగన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే ‘రాజాసాబ్’ వంటి చిత్రాలతో పోటీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. అయితే కథలో ఉన్న కొన్ని రాజకీయ ప్రాధాన్యత కలిగిన అంశాలు, వివాదాస్పద సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాయిదాల పర్వం మొదలైంది. గతంలో విజయ్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన 'బీస్ట్'