జన నాయకుడు’ వచ్చేస్తున్నాడు.. దళపతి విజయ్ లాస్ట్ డ్యాన్స్ కి డేట్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన కెనడా డిస్ట్రిబ్యూటర్
Actor ProfilePolitician

జన నాయకుడు’ వచ్చేస్తున్నాడు.. దళపతి విజయ్ లాస్ట్ డ్యాన్స్ కి డేట్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన కెనడా డిస్ట్రిబ్యూటర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జన నాయకుడు’ వచ్చేస్తున్నాడు.. దళపతి విజయ్ లాస్ట్ డ్యాన్స్ కి డేట్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన కెనడా డిస్ట్రిబ్యూటర్
Samayam Telugu15 Oct 2026
జన నాయకుడు’ వచ్చేస్తున్నాడు.. దళపతి విజయ్ లాస్ట్ డ్యాన్స్ కి డేట్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన కెనడా డిస్ట్రిబ్యూటర్

‘జన నాయగన్‌’ సినిమా కోసం దళపతి అభిమానులు ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది విజయ్ కెరీర్ లో చివరి చిత్రం. ఆయన టీవీకే పార్టీ పెట్టి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడే ఈ విషయాన్ని ప్రకటించారు. అందుకే ‘జన నాయకుడు’ చిత్రాన్ని అందరూ ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేయాలని వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజుకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ‘జన నాయగన్‌’ మూవీ ఊహించని విధంగా సెన్సార్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్‌ అడ్డంకుల కారణంగా, సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యమయింది. అయితే ఇప్పుడు సెన్సార్ ఇబ్బందులన్నీ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలలో విజయ్ ఆఖరి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. జులై 24న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ఈ మేరకు కెనడా డిస్ట్రిబ్యూటర్‌ హింట్‌ ఇచ్చారు. కెనడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యార్క్ సినిమాస్ ‘జన నాయగన్’ గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఎట్టకేలకు మన దళపతి విజయ్ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారని, జులై 24 నుంచి కెనడాలో యార్క్ సినిమాస్ ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోందంటూ ఓ పోస్టర్‌ పంచుకుంది. త్వరలోనే టికెట్‌ బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ అవుతాయని పేర్కొంది. దీంతో సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకొని, జన నాయకుడు వస్తున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో 'జన నాయగన్' మూవీ తెరకెక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని తెలుగులో 'జన నాయకుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించారు. ముందుగా పొంగల్ కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు ఉన్నాయనే కారణాలతో సెన్సార్ సభ్యులు అభ్యంతరం