జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్
Actor ProfileCelebrity

జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
Zee Telugu13 Oct 2026
జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kalyana Lakshmi Scheme: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఎలా అమలు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కూడిన సమాధాన అఫిడవిట్‌ను నాలుగు వారాల్లో దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకాలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ బుధవారం విచారించారు. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ నిధులను పంపిణీ చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 245, 246లను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. ఈ పథకాలకు సంబంధించి జారీ చేసిన 8 జీవోలను రద్దు చేయాలని ఆయన కోరారు. విచారణ సందర్భంగా, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతల గురించి న్యాయమూర్తి నిర్దిష్ట వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యం అవుతున్నాయి. కాంట్రాక్టర్ల బిల్లులు, భూసేకరణ పరిహారం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ భూములను నగదుకు అమ్ముతున్నారు. కానీ రాష్ట్రం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. ఈ ఉచిత పథకాలు ఎవరు అడిగారు అంటూ కోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం వద్ద అదనపు నిధులు ఉంటే ఉచితాలు అందించవచ్చని.. అయితే చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పిటిషనర్ సూచించారు. 2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద ఇప్పటివరకు రూ.13,484 కోట్లు ఖర్చు చేశారని.. కాగ్ నివేదిక ప్రకారం.. అర్హత లేనివారు సుమారు రూ.90 కోట్లు అందుకున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ.. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్, ఈ