జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు
Actor ProfilePolitician

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్ టైల్ పార్కులో విషాదం
Andhra Jyothy15 Dec 2026
వరంగల్ జిల్లా శాయంపేట మెగా టెక్స్ టైల్ పార్కులో విషాదం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు
Andhra Jyothy14 Dec 2026
జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా తెలంగాణకు కేసీఆర్ నష్టం చేశారని ఆగ్రహించారు. ఈరోజు (గురువారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీలో గద్దె ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావని ప్రస్తావించారు. కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తాననే విషయాన్ని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి మర్చిపోయినట్లుగా ఉన్నారని విమర్శించారు. జగదీశ్వర్ రెడ్డి రాజకీయాల కోసం రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసిన, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి రోజుకో కొత్త డ్రామాకి తెర లేపుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో అదనంగా తరలించుకొని పోయిన నీటి గురించి వైసీపీ నేతలే ప్రెస్ మీట్లు పెట్టి మరి చెబుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీ వేదికగా శ్రీశైలం నుంచి తీసుకెళ్తున్న నీటిని ప్రస్తవించ లేదా అని నిలదీశారు. కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులను పెంచుతున్నట్లు జగన్ అసెంబ్లీలో చెప్పారని అన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగదీష్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అని శ్రీనివాస్